నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం వరకు వరుస అపజయాలను అందుకున్న బాలయ్య "అఖండ" మూవీ తో సక్సెస్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక పోయిన సంవత్సరం భగవంత్ కేసరి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక బాబి రాసుకున్న కథ ప్రకారం ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు బాలయ్య సరసన హీరోయిన్ లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఊర్వశి రౌటేలా ఒక హీరోయిన్ గా చిత్ర బృందం చాలా రోజుల క్రితమే సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈమెపై కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేసినట్లు సమాచారం. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీవలో బాలయ్య సరసన రెండవ హీరోయిన్ గా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని నిధి అగర్వాల్ సెలెక్ట్ అయినట్లు ఆ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే బాలయ్య ప్రస్తుతం రాజకీయ ప్రచారాలలో పాల్గొంటూనే వీలు చిక్కినప్పుడల్లా సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే మొత్తం పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: