చిరంజీవి , జూనియర్ ఎన్టీఆర్ , శర్వానంద్ , రవితేజ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విరు ఏ మూవీ లలో నటిస్తున్నారు..? అందుకు సంబంధించిన షూటింగ్ వివరాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిషమూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ముచింతల్ పరిసర ప్రాంతాల్లో ఈవినింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.


మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "వార్ 2" అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ముంబై లో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ పై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తుంది. ప్రస్తుత చిత్రీకరణలో ఉన్న ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కి హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

శర్వానంద్ ప్రస్తుతం తన కెరీయర్ లో 37 సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శర్వానంద్ పై రాత్రి పూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రజెంట్ లక్నోలో రవితేజ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: