సూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం జైలర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ తర్వాత రజిని తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ అనే మూవీ లో ఓ చిన్న పాత్రలో నటించాడు . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ప్రస్తుతం రజనీ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. లోకేష్ ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలా కోలీవుడ్ టాప్ హీరో అయినటువంటి రజనీ కాంత్ ... కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో రూపొందుతున్న మూవీ కావడంతో ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను కన్ఫామ్ చేయలేదు. దానితో "తలైవర్ 171" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణను ఈ మూవీ యూనిట్ జరుగుతుంది. ఏప్రిల్ 22 వ తేదీన ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ టీజర్ విడుదల కానుంది. ఇక తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది  ఈ మూవీ లో శృతి హాసన్ నటిస్తున్నట్లు ... అందులో భాగంగా ఈ సినిమాలో శృతి హాసన్ , రజనీ కాంత్ కూతురి పాత్రలో కనిపించనున్నట్లు ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: