ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు వారి వారసులని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా స్టార్ కిడ్స్ ఎంట్రీ పై కూడా అట అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉంటాయి. ఇలా అప్పటికే ప్రత్యేకమైన స్థార్ డమ్ సంపాదించుకున్న హీరోలకు సంబంధించిన వారసులు సినిమాల్లోకి వచ్చి తండ్రికి తగ్గ వారసులు అనిపించుకోవాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇప్పుడు వరకు ఇలా ఎంతో మంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీకి  పరిచయమయ్యారు.


 తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఇలా స్టార్ కిడ్స్ గా హీరోయిన్స్ పరిచయమైంది చాలా తక్కువ. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇప్పటికే హీరోయిన్లు భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినవారు ఉన్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ ఎంట్రీ కి సన్నాహాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారుక్ ఖాన్ తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారట. దీనికోసం వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా ప్లాన్ వేసుకున్నాడు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన కూతురు సుహాన ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఏకంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యారట. సుజయ్ గోష్ దర్శకత్వంలో కింగ్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుందట. 2025 ద్వితీయార్థంలో ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నది తెలుస్తుంది. కాగా షారుక్ ఖాన్ కూతురు సుహాన ఖాన్  ఇప్పటివరకు ఓటీటిలో పలు వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను అలరించారు  మొదటిసారి వెండితెరపై అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: