సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆయన స్టైల్ కే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరూ హీరోల లాగా పెద్దగా యాక్షన్స్ అనే సన్నివేశాలు చేయాల్సిన పనిలేదు.. ఆయన స్టైల్ గా నడుచుకుంటూ వస్తే చాలు థియేటర్ మొత్తం ప్రేక్షకుల విజిల్స్ తో మారుమోగిపోతూ ఉంటుంది. ఆ రేంజ్ లో ఆయనకు గుర్తింపు ఉంది. అయితే రజినీకాంత్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు   73 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో అదరగొట్టేస్తున్నారు. గతంలో వరుస ఫ్లాపులతో సతమతమైన రజనీకాంత్ జైలర్ అనే సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు క్రేజీ డైరెక్టర్గా గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ కనకరాజుతో మూవీ చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే.


 ఇక ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలం నుంచి లోకేష్ కనకరాజ్ స్టార్ హీరోలతో క్రేజీ కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తూ సూపర్ హిట్ కొడుతున్నారు. దీంతో రజనీతో ఎలాంటి కాన్సెప్ట్ ని ప్లాన్ చేశాడో అనే విషయం పైన చర్చ జరుగుతుంది  కాగా ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కమల్ హాసన్ కూతురు నటించబోతుందట. రజనీకాంత్ కూతురు పాత్రలో ఇక శృతిహాసన్ కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు శృతిహాసన్ కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది అనే విషయం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: