ఇప్పటివరకు సౌత్ ఇండియా నుండి విడుదల అయిన మూవీ సాంగ్ లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 6 సాంగ్స్ ఏవో తెలుసు కుందాం.

తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ ప్రస్తుతం గోట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు . తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి "విజీల్ పొడు" అంటూ సాగే మొదటి సాంగ్ ను విడుదల చేసింది.  ఈ పాటకు విడుదల అయిన 24 గంటల్లో 24.88 మిలియన్ వ్యూస్ దక్కాయి.

తలపతి విజయ్ హీరో గా రూపొందిన బీస్ట్ మూవీ లోని అరబిక్ కుత్తు సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 23.77 మిలియన్ వ్యూస్ దక్కాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ లోని దమ్ మసాలా అంటూ సాగే సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 17.42 మిలియన్ వ్యూస్ దక్కాయి.

విజయ్ హీరోగా రూపొందిన వారుసు మూవీ లోని రంజితమే సాంగ్ కి విడుదల 24 గంటల్లో 16.68 మిలియన్ వ్యూస్ దక్కాయి.

తలపతి విజయ్ హీరో గా రూపొందిన లియో మూవీ లోని నా రెడీ అంటూ సాగే పాటకు విడుదల అయిన 24గంటలో 16.55 మిలియన్ వ్యూస్ దక్కాయి.

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట మూవీ లోని పెన్ని సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 16.38 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: