సాధారణంగా ఏ హీరోయిన్ల కైనా సరే సినీ కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే 10 15 ఏళ్ల వరకు వారి సినీ కెరియర్ సాఫీగా సాగడం కష్టం అని చెప్పాలి. అటువంటిది 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని  ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీని నయనతార ఏళ్లుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తుంది ఈ హీరోయిన్. ఒక్కో సినిమాకి కోట్లు వసూలు చేస్తూ స్టార్ హీరోయిన్గా వెలిగిపోతుంది. తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా

భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న బిజీగా ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో పాటు వెంకటేష్ చిరంజీవి బాలయ్య వంటి సీనియర్ హీరోలతో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే నయనతార రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటుంది అని చెప్పొచ్చు. 40 వయస్సు దాటినప్పటికీ ఇప్పటికీ నయనతార అదే జోష్తో దూసుకుపోతోంది. అలానే అత్యధిక రెమ్యూనరేషన్

తీసుకుంటున్న హీరోయిన్గా కూడా కొత్త రికార్డు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏజ్ లో ఒక్కో సినిమాకి దాదాపుగా 15 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకు ఉంటుంది ఈ బ్యూటీ. ఆమె లగ్జరీ లైఫ్ లో వాడే ప్రతీ వస్తువూ.. కాస్ట్లీది.. లగ్జరీ వస్తువులు చాలానే ఉన్నాయి. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ విలాసవంతమైనవే. అయితే అందులో ఆమె వాచీ ప్రస్తుతం చాలా స్పెషల్‌ గా నిలుస్తోంది.. ఎందుకంటే ఆమె ధరించిన వాచీ రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్. లగ్జరీ వాచీలు అమ్మె వెబ్‌ సైట్‌ ప్రకారం నయనతార పెట్టుకున్న రోలెక్స్ వాచ్ ధర 50 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో కూడా మోడల్‌ బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే నయన్ వాచ్ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: