టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ మూడవ సినిమా కాసుల వర్షం కురిపించింది. అయితే దీనికంటే ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ వంటి సినిమాలు సైతం భారి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఆఖండ సినిమా సంచలనాన్ని సృష్టించింది. బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది ఆఖండ. అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. 

దాంతో పాటు అఘోర పాత్రలో నటించి అందరికీ షాక్ ఇచ్చాడు టాలీవుడ్ నటసింహం నందమూరి   బాలయ్య. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అని నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ తరువాత వీర సింహారెడ్డి సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో మరొక హిట్ కొట్టాడు. ఇక అలా టాలీవుడ్ నటసింహం నందమూరి   బాలయ్య చేస్తున్న సినిమాలు అన్నీ కూడా వరుసగా హిట్ లు అవుతున్నాయి. 

ఈ క్రమంలోనే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను సైతం విడుదల చేశారు మేకర్స్. అయితే బాలయ్య త్వరలోనే అఖండ 2 చేస్తారని నందమూరి అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖండ సీక్వెల్ పై దర్శకుడు బోయపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తానని బోయపాటి అన్నారు. అఖండ సీక్వెల్‌ ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నకు.. అఖండ సీక్వెల్‌లో సమాజానికి ఏం అవసరమో అదే చూపిస్తాను.. అని చెప్పుకొచ్చారు బోయపాటి.

మరింత సమాచారం తెలుసుకోండి: