అర్ అర్ అర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ జోష్ లోనే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాకి కాస్త బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వార్ 2 సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం ముంబైకి వెళ్ళాడు. మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కేవలం పది రోజుల షూటింగ్లో మాత్రమే ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల మధ్య యాక్షన్ సీక్వెన్స్ ను షూటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కూడా ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగులో ఇద్దరు స్టార్స్ కూడా బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సెట్స్ నుండి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్లకి సంబంధించిన ఫోటోలు కొన్ని లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కూడా లేటేస్ట్ స్టైలీష్ లుక్స్‏లో కనిపిస్తున్నారు. అందులో తారక్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫుట్ లో ఉండగా.. హృతిక్ స్కై బ్లూ షర్ట్, బ్లాక్ కోట్ తో కనిపిస్తున్నారు. ఇద్దరూ స్టైలీష్ రా ఏజెంట్స్ లుక్స్ లో కనిపిస్తుండడంతో వీరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే ఇందులో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి నటిస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: