సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా రాబోతోంది. దీనికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సాధారణంగా రాజమౌళి తన సినిమాలకి సంబంధించిన షూటింగ్ వివరాలను ముందే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సినిమా ఎలా ఉండబోతోంది..

 షూటింగ్ ఎక్కడ ప్లాన్ చేసారు అన్న విషయాలను ముందుగానే వెల్లడిస్తారు.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ బాబుతో తీయబోయే సినిమాకు సంబంధించిన పలు వివరాలతో పాటు కాన్సెప్ట్ టీజర్ ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినబడుతోంది. కద, అందులోని పాత్రల వివరాలను కూడా చాలా క్లియర్ కట్ గా చూపించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది. అంతేకాదు ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్లుగా వినికిడి.

అయితే ఈ వివరాలను అన్నిటిని డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో విడుదల చేస్తారా.. లేదా ఏదైనా సందర్భంలో పంచుకుంటారా లేక సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారా అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేశ్‌ లుక్‌కు సంబంధించి ఇప్పటికే స్కెచ్‌లు పూర్తవగా, వాటిల్లో 'ది బెస్ట్‌'ను రాజమౌళి, ఆయన టీమ్‌ సెలక్ట్‌ చేసి, ఫైనల్‌ చేయనున్నారు. ఆ వెంటనే మహేశ్‌తో లుక్‌ టెస్ట్‌ చేసి, మూవీకి సంబంధించిన లుక్‌ను లాక్‌ చేయనున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించి కీలక పాత్రల్లో కనిపించే నటీనటుల కోసం వేట కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో తీయబోయే ఈ మూవీలో వివిధ భాషా నటులు నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: