మెగా ఫ్యామిలీ నుండి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు గ్లోబల్ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే రామ్ చరణ్ తన రెండవ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లెజెండ్ రి డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.

సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16 సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఏంటి అన్నది ఇంకా రివీల్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి పెద్ది అని టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ నువ్వు సైతం ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ మధ్యనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఒక అరుదైన గౌరవం దక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ.

కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా అందించింది యూనివర్సిటీ యాజమాన్యం. అయితే ఈ డాక్టరేట్ అందుకునేందుకు గాను ఆయన తన భార్య, పాప క్లింకారా అలాగే పెంపుడు కుక్క రైమ్ తో కలిసి స్పెషల్ ఫ్లైట్లో చెన్నై వెళ్లారు. ఇక చెన్నైలో దిగిన తర్వాత అక్కడి ఎయిర్ పోర్ట్ లోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ ధరించిన షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆయన షర్టు ఏమిటి? అని ఢీకొట్ చేసే పనిలో కూడా కొన్ని సోషల్ మీడియా పేజెస్ కూడా పడ్డాయి. అందులో ఒక పేజీ ఆ షర్ట్ కంపెనీ డిఆర్. ఆ షర్టు ద్వారా దాదాపు రూ.63 వేల చిల్లర ఉంటుందని తేల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: