టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న కాంబినేషన్ లో బాలయ్య , బోయపాటి కాంబినేషన్ ప్రథమ స్థానంలో ఉంటుంది అని చెప్పిన పెద్దగా వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు రూపొందిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. మొదటగా వీరిద్దరి కాంబో లో సింహ అనే మూవీ రూపొందింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ కంటే ముందు వరస అపజాయలతో డీలా పడిపోయిన బాలకృష్ణమూవీ తో తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వీరి కాంబోలో లెజెండ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం వీరి కాంబోలో అఖండ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది.

ఇక అఖండ సక్సెస్ అయిన వెంటనే ఏ సినిమాకి సీక్వెల్ ఉండబోతుంది అని ఈ సినిమా హీరో , దర్శకుడు పలు మార్లు చెప్పుకుంటూ వచ్చారు. ఇకపోతే తాజాగా కూడా ఈ సినిమా దర్శకుడు బోయపాటి "అఖండ" మూవీ కి సీక్వల్ గా "అఖండ 2" ఉండబోతుంది అని ప్రస్తుతం బాలకృష్ణ గారు రాజకీయ పనులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ పనులు అన్ని ముగియగానే "అఖండ 2" మూవీ స్టార్ట్ అవుతుంది అని ... అందులో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పాయింట్ ఉంటుంది అని కూడా బోయపాటి గారు తెలియజేశారు. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు ఈయన చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: