లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సంవత్సరాల పాటు వరుస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక అపజాయలను ఎదుర్కొంటూ డీలా పడిపోయిన కమల్ కొంత కాలం క్రితమే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే మూవీ లో హీరో గా నటించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తో కమల్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. దానితో ప్రస్తుతం ఈయన వరుస సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ప్రస్తుతం ముందుకు సాగిస్తున్నాడు.

అందులో భాగంగా కొంత కాలం క్రితమే కమల్ , మణిరత్నం దర్శకత్వంలో "థగ్ లైఫ్" అనే మూవీ ని కూడా ఓకే చేశాడు. ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ మూవీ లో కీలక పాత్రల్లో దుల్కర్ సల్మాన్ , జయం రవి కనిపించబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుండి దుల్కర్ సల్మాన్ మరియు జయం రవి ఇద్దరు కూడా తప్పుకున్నట్లు ఆ పాత్రల కోసం మణిరత్నం వేరే నటులను వెతుకుతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ మరియు జయం రవి లు ఇద్దరు కూడా కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న "థగ్ లైఫ్" సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరి కొంత కాలం లోనే వీరిపై కూడా ఈ మూవీ యూనిట్ సన్నివేశాలను వ్యతిరేకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ క్రేజీ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kh