పోయిన సంవత్సరం నార్నే నితిన్ , సంగీత్ శోభన్ , నితిన్ రామ్ లు ప్రధాన పాత్రల్లో ... కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. అ

లా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర  వసూలు చేసింది. ఇలా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా "మ్యాడ్ మాక్స్" అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ప్రకటించడం ఆలస్యం ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా మొదలు పెట్టింది.  

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గుంటూరు కారం సినిమా కోసం వేసిన హౌస్ సెట్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నటీనటులపై ఈ మూవీ బృందం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి అంతే త్వరగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి ఈ సినిమాను జనాల ముందుకు తీసుకురావాలి అని ఈ మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మ్యాడ్ మ్యాక్స్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉండగా ... శ్రీ గౌరీ ప్రియ , అనంతిక , గోపిక ఉదయన్ లు ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సీసీరోలియో మ్యూజిక్ ను అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: