టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. కలర్ ఫోటో మూవీ లో హీరోయిన్ గా నటించి నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న చాందిని చౌదరిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. యువ దర్శకుడు విద్యాధర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ లోని విశ్వక్ , చాందిని నటనలకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మూవీ ని కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ , వి సెల్యులాయిడ్ , విఆర్ గ్లోబల్ మీడియాక్, శ్వేత వాహిని స్టూడియోస్ లిమిటెడ్ , క్లౌన్ పిక్చర్స్ సంస్థల పై కార్తీక్ శబరీష్ , శ్వేతా మొరవనేని గ్రాండ్ గా నిర్మించారు. మంచి అంచనాలు నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

దానితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుని సక్సెస్ ను అందుకుంది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి "జీ 5" సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా గత కొన్ని రోజులుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. దానితో ప్రస్తుతం "జీ 5" డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా టాప్ 5 ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా థియేటర్ లలో మంచి కలెక్షన్ లను రాబట్టి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం "ఓ టి టి" ప్రేక్షకులను కూడా బాగానే అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: