అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ‘తండేల్’. కార్తికేయ 2 ఫేమ్ చందూ ముండేటి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక మొన్నటి దాకా ఈ సినిమా దసరా, దీవాళీ సమయంలో వస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే.. ఈ సినిమా దసరా, దీవాళీ రేస్ నుంచి తప్పుకుందట. ఎందుకంటే ఆ సమయంలో రామ్ చరణ్, రజినీకాంత్, ఎన్టీఆర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. మరి ఆ సినిమాలతో పోటీ ఎందుకు అనుకున్నారో, లేదా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందో గాని.. ఈ సినిమాని డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారని సమాచారం తెలుస్తుంది.


ఇక ఈ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నారట. త్వరలోనే ఈ తేదీని అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారని ఇండస్ట్రీలో సమాచారం వినిపిస్తుంది. కాగా అదే డేట్ కి నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా కూడా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద నితిన్ వర్సెస్ నాగచైతన్య పోటీ గట్టిగా కనిపించబోతుంది. పైగా ఈ రెండు సినిమాలు ఈ ఇద్దరి హీరోలకు ఎంతో ముఖ్యమైనవి.ప్రస్తుతం వీరిద్దరూ వరుస ప్లాప్స్ లో ఉన్నారు.ఒకే ఒక్క హిట్టు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలతో వీరిద్దరూ సరైన హిట్స్ అందుకుంటారా లేదా చూడాలి. ఇక నితిన్ రాబిన్ హుడ్ సినిమాని వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటి దాకా తెలియజేయ లేదు.నితిన్ భీష్మ తరువాత హిట్టు కొట్టలేదు. నాగ చైతన్య లవ్ స్టోరీ తరువాత హిట్టు కొట్టలేదు. మధ్యలో దూత వెబ్ సిరీస్ తో మెప్పించినా కూడా అది ఓటీటికి మాత్రమే పరిమితం అయ్యింది.మరి ఈ సినిమాలతో వీళ్ళు మళ్ళీ ఫాంలోకి వస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: