అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం  తండెల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ మనీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలోనే విరి కాంబోలో సవ్యసాచి , ప్రేమమ్ అనే మూవీ లు రూపొందాయి. ఇది వీరి కాంబోలో మూడవ సినిమా.

ఇకపోతే చందు మండేటి ఆఖరుగా నిఖిల్ సిద్ధార్థ్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన "కార్తికేయ 2" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. అలా "కార్తికేయ 2" లాంటి భారీ విజయం తర్వాత ఈయన దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం అందులో నాగ చైతన్య హీరో గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ క్లారిటీకి వచ్చినట్లు ... అందులో భాగంగా ఈ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరో ఒకటి , రెండు రోజుల్లో ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ నుండి ఇప్పటికే ఈ చిత్ర బృందం ఓ వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: