మాస్ మహారాజా రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది.

అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ లక్నో లో ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే లక్నో లో ఈ మూవీ బృందం 30 రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ ను పూర్తి చేశారు. అది ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

షూటింగ్ లో ఎంతో కష్టపడి చెమట చిందించిన రవితేజ మరియు విలన్ జగపతి బాబు కు ఆయన ఈ పోస్టు లో భాగంగా స్పెషల్ థాంక్స్ చెప్పారు. అలాగే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాదు లో ఉండబోతున్నట్లు ... అది కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు హరీష్ శంకర్ ఈ పోస్టులో పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే గతంలో రవితేజ , హరీష్ శంకర్ కాంబో లో షాక్ , మిరపకాయ్ మూవీలు రూపొందాయి. ఇందులో షాక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ... మిరపకాయ్ మంచి విజయం సాధించింది. మరి ప్రస్తుతం వీరిద్దరి కాంబో లో పొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: