మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజార్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నప్పటికీ ఈ సినిమా విడుదల గురించి పక్కా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. గతంలో చాలా సార్లు దిల్ రాజు ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.

దానితో ఈ మూవీ విడుదల గురించే ఓ క్లారిటీ మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ప్రేక్షకులకు కూడా అర్థం అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చెక్కర్లు కొడుతుంది. ప్రముఖ హిందీ క్రిటిక్ అండ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ఈ సినిమా విడుదలకు సంబంధించి పోస్ట్ చేసారు. ఈ ట్వీట్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ ని నవంబర్ అని ఆయన యాడ్ చేయడంతో ఈ మూవీ విడుదల ఆల్మోస్ట్ నవంబర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా యొక్క నార్త్ హక్కులను అనిల్ తడాని దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: