తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే సూపర్ సక్సెస్ అయిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన పెళ్లి చూపులు మూవీలో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక టాక్సీవాలా సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈ నటుడు పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఇకపోతే ఈ సినిమా కంటే ముందు విజయ్ కి కేవలం యూత్ లో మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇక గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈయనకు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దానితో ఒక్క సారిగా విజయ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా మారిపోయాడు. ఇలా గీత గోవిందం సినిమాతో అద్భుతమైన గుర్తింపును , క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత వరుసగా నోటా , డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ , లై , ఖుషి సినిమాలతో అభజాయలను అందుకున్నాడు.

ఇలా వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన ఈ నటుడు పరుశురామ్ దర్శకత్వంలో "ది ఫ్యామిలీ స్టార్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇక మళ్ళీ ఈ దర్శకుడు గీత గోవిందం స్థాయి విజయాన్ని విజయ్ కి అందిస్తాడు... దానితో ఈయన తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా విజయ్ కి నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ది ఫ్యామిలీ స్టార్ మూవీ కి 43 కోట్ల రేంజ్ లో ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 18 కోట్ల షేర్ కలెక్షన్ లను మాత్రమే రాబట్టింది.

దానితో ఈ మూవీ మరో 25 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే అది కష్టమే అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ కనుక సక్సెస్ కాకపోయినట్లు అయితే పరుశురామ్ కూడా విజయ్ ని సక్సెస్ తో గట్టెక్కించలేకపోయినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd