టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం హ్యాపీ డేస్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆ టైం లో అద్భుతమైన విజయాన్ని సాధించి భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే హ్యాపీ డేస్ మూవీ ని తిరిగి ఈ రోజు థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా శేఖర్ కమ్ముల తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఈయన మాట్లాడుతూ ... హ్యాపీ డేస్ మరియు లీడర్ సినిమాలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ... హ్యాపీ డేస్ మూవీ ఎప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. దానికి సీక్వెల్ చేద్దామన్న కూడా  కథ ఏ మాత్రం కుదరట్లేదు. ఇక లీడర్ సినిమా విషయానికి వస్తే దానికి సీక్వెల్ చేయాలని ఆలోచన ఉంది. ఒక వేళ ఆ సినిమాకు కనుక సీక్వెల్ చేసినట్లు అయితే కచ్చితంగా అందులో రానా నే హీరోగా ఉంటాడు. కాకపోతే ఆ మూవీ కి సీక్వెల్ చేయడానికి కాస్త సమయం పడుతుంది.

లీడర్ సినిమాను అప్పట్లో లక్ష కోట్ల అవినీతి అనే ఒక పాయింట్ పై సినిమాను చేశాం. ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారింది అని శేఖర్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే శేఖర్ ప్రస్తుతం నాగార్జున , ధనుష్ హీరోలుగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందుతున్న కుబేర అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లు అయితే శేఖర్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: