సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం గుంటూరు కారం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు . సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... జయరామ్ , రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , రాహుల్ రవీంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది . దానితో ఈ మూవీ యవరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది . ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమిని సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం చేసినప్పుడు ఈ మూవీ కి 9.23 "టీ ఆర్ పి" రేటింగ్ దక్కింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించలేకపోయిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను మాత్రం బాగానే అలరించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: