సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణను, పాపులారిటీని సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి అనే మూవీతో దర్శకుడిగా తన కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సాధించడంతో ఒక్క సారిగా ఈయనకు అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. అందులో భాగంగా తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అర్జున్ రెడ్డి మూవీని షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇకపోతే సందీప్ దర్శకత్వంలో రూపొందిన కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు చాలా ఫీల్ అయ్యాను అని ఆ సినిమాలో డీన్ పాత్రలో నటించిన అదిల్ హుస్సేన్ అన్నారు.

ఇక ఆయనపై సోషల్ మీడియా వేదికగా సందీప్ రెడ్డి వంగ ఫైర్ అయ్యారు. తాజాగా సందీప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... మీరు మీ కెరీర్ లో ఇప్పటి వరకు 30 సినిమాలలో నటించారు. వాటిలో ఏ మూవీ ద్వారా కూడా మీకు రాని గుర్తింపు కబీర్ సింగ్ సినిమాతో వచ్చింది. మీకు దురాశ ఎక్కువ. మీలాంటి వాళ్లను నా సినిమాలో తీసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నా. ఇకపై మీరు సిగ్గుపడకుండా ఆ మూవీ లోని మీ ఫెస్ ను ఏఐ తో మార్చేస్తా అని సందీప్ అన్నారు. ఇక తాజాగా సందీప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Srv