దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో త్వరలోనే ఒక సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటినుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమాని రాజమౌళి ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఒక అడ్వెంచర్ జానర్ సినిమాగా రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్  ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. 

అయితే గతంలో మహేష్ బాబు సిమ్రాన్ కాంబినేషన్లో వచ్చిన యువరాజు సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు   దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో   వస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్ కు ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాన్ని రాజమౌళి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఇప్పటి నుండే స్టార్ట్ అయ్యింది. మొత్తానికి మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ మళ్లీ కనిపిస్తుంది అని తెలియడంతో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 అప్పుడు చేసిన సినిమా ఫ్లాప్ అయిన ఇప్పుడు చేయబోయే సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నిటిని బద్దలు చేస్తుంది అంటూ అభిమానులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో ఇటు మహేష్ బాబు, అటు రాజమౌళి ఇద్దరు పాన్ వరల్డ్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాల్లో మహేష్ సరసన ఓ హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: