టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో మంచు విష్ణు ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్ లో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో కొన్ని మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం విష్ణు కు సరైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. విష్ణు ఆఖరుగా జిన్నా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇందులో పాయల్ రాజ్ పుత్ , సన్ని లియోన్ హీరోయిన్లుగా నటించారు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం మంచు విష్ణు "కన్నప్ప" అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను నిర్మించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ ,  అక్షయ్ కుమార్ , శివ రాజ్ కుమార్ కూడా  కీలకపాత్రలలో నటించబోతున్నారు.

ఇక చాలా రోజుల క్రితం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ తాజాగా ఈ బ్యూటీసినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు దానితో ఈ మూవీ కి తేదీలను అడ్జస్ట్ చేయలేను అనే ఉద్దేశంతో ఈ బ్యూటీసినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

మరి ఈమె స్థానంలో ఇప్పటికే కన్నప్ప యూనిట్ కాజల్ అగర్వాల్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే చాలా మంది స్టార్ నటులు ఈ మూవీ లో నటిస్తున్న కారణంగా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mm