తెలుగు, తమిళ పరిశ్రమలలో అద్భుతమైన గుర్తింపు కలిగిన డాన్స్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమా పాటలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేసే అద్భుతమైన డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఈయన ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా కూడా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా మల్టీ టాలెంటెడ్ గా తనని తాను ఎన్నో సార్లు నిరూపించుకున్న రాఘవ లారెన్స్ కేవలం వెండితెరపై మాత్రమే తన ప్రతిభను చూపించడం మాత్రమే కాకుండా బయటి జీవితంలో కూడా ఎంతోమందికి సహాయాలను చేస్తూ ఉంటాడు.

ఇప్పటికే ఈయన ఎంతో మంది పిల్లలకు ఎన్నో ఆపరేషన్లను చేయించి వారికి కొత్త జీవితాలను ప్రసాదించాడు. ఇక బయట ఎన్నో ట్రస్టులను నడుపుతూ ఎంతో మంది పేద ప్రజలకు, అనాధ పిల్లలకు ఈయన చదువు చెప్పించడం, వసతిని కల్పించడం ఇలా ఎన్నో గొప్ప గొప్ప పనులను చేస్తూ వస్తున్నారు. దానితో నిజ జీవితంలో రాఘవ లారెన్స్ ను ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఇకపోతే తాజాగా మరోసారి ఈయన తన గొప్పతనాన్ని నిరూపించుకున్నాడు. ఇటీవల చెన్నైలో మల్లర్ఖంబం (విలు విద్య) ను చాలా ధైర్యంగా ప్రదర్శించిన దివ్యాంగులకు బైక్స్ కొనిస్తాను అని మరియు ఇల్లు కట్టిస్తాను అని రాఘవ లారెన్స్ హామీ ఇచ్చారు.

హామీ ఇచ్చిన రెండు రోజులకే లారెన్స్ తన హామీలలో కొన్నింటిని చేసేశాడు. హామీ ఇచ్చిన రెండు రోజుల్లోనే విలు విద్య ను చాలా ధైర్యంగా ప్రదర్శించిన వారికి 13 బైక్స్ ను లారెన్స్ వారికి అందించారు. దానితో వారు ఎంతో సంతోషపడ్డారు. ఇక త్వరలోనే వారికి ఇల్లు కూడా కట్టించేందుకు ఏర్పాటు చేస్తాను అని ఆయన తెలిపారు. ఇలా రాఘవ లారెన్స్ తన వ్యక్తిత్వంతో ఎంతో మంది ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rl