అల్లు అర్జున్ ఆఖరుగా "పుష్ప పార్ట్ 1" అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఇందులోని అల్లు అర్జున్ నటనకు గాను ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీలోని తన నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డును కూడా అల్లు అర్జున్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు అనుగుణం గానే ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించినప్పటికీ ఇందులో ఎలాంటి డైలాగులు లేకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు.

ఇక ఆయన అభిమానులకు ఫుల్ జోష్ నింపేందుకు ఈ మూవీ బృందం ఈ సారి అద్భుతమైన డైలాగులతో మరో టీజర్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం పుష్ప యూనిట్ ఒక అదిరిపోయే టీజర్ ను డైలాగులతో కట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు ఆ పనులు పూర్తి కాగానే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా... సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa