ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్.. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు వరుస చిత్రాలతో అలరించనున్నారు. వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు శర్వానంద్.ప్రస్తుతం మనమే సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. సరికొత్త కథతో రాబోతున్న ఈ మనమే సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ పాట కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. సినిమాపై ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ లో ఆ సాంగ్ మంచి బజ్ ని అయితే క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ను కూడా విడుదల చేశారు.ఆ టీజర్ ను గమనిస్తే.. మనమే మూవీ అంతా కూడా లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. లండన్, యూరప్ చుట్టూ సినిమా తిరుగుతున్నట్లు చూస్తుంటే తెలుస్తోంది. మంచివాడిగా కనిపించే బ్యాడ్ బాయ్ అంటూ ఇందులో హీరో చెప్పుకుంటుంటారు. 


అనుకోకుండా హీరోకు హీరోయిన్ కృతి శెట్టి పరిచయమవుతుంది. అయితే వారిద్దరి జీవితంలోకి ఓ బాబు వచ్చాక వారి లైఫ్ ఎలా సాగిందనే విషయంపై ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.ఈ సినిమాలో చిన్నారి నేపథ్యంలో సాగే సీన్స్ హైలైట్‌ గా నిలవనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లో కూడా బాబుతో హీరో శర్వానంద్‌ చూపించారు. ఆ బాబు శ్రీరామ్ ఆదిత్య కొడుకని సమాచారం వినిపిస్తోంది. హీరోయిన్ కృతి శెట్టి గ్లింప్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపించి  ఎంతగానో ఆకట్టుకుంది. శర్వా నంద్ కూడా చాలా స్టైలిష్గా కనిపించారు. ముఖ్యంగా గ్లింప్స్ లో డైలాగులు కూడా బాగా అదిరిపోయాయి. చివర్లో ఇద్దరిలో ఒకరే ఏడవండి అంటూ శర్వా చెప్పిన డైలాగ్ కూడా చాలా కామెడీగా ఉంది. మొత్తానికి ఈ గ్లింప్స్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటూ సాగుతోంది.ఈ మూవీలో శర్వానంద్, కృతి శెట్టితో పాటు సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: