కన్నడ దర్శకుడు షబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ కాంతార. ఈ సినిమా కన్నడంలో ముందుగా రిలీజ్ అయ్యి ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.ఆ తరువాత ఇతర భాషలలోకి కూడా ఈ సినిమా డబ్బింగ్ అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా కాంతార సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.ఇంకా అలాగే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 400  కోట్ల పైగా అన్ని భాషల్లో కలిపి కాంతారా సినిమా వసూళ్లు కలెక్ట్ చేసింది.కేవలం 15 కోట్లతో మాత్రమే నిర్మించిన ఈ సినిమాతో హోంబలే ఫిలిమ్స్ భారీ లాభాలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ మూవీని రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇదొక ప్రీక్వెల్. అంటే కాంతారకి ముందు జరిగిన కథగా ఈ ఈ సినిమా రాబోతోంది.గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా ఈ మూవీని రిషబ్ శెట్టి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.


ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని కూడా ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తోంది. రీసెంట్ గా హీరో రిషబ్ శెట్టి మోహన్ లాల్ ని మీట్ అయ్యారు. వీటికి సంబందించిన ఫోటోలని రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో మోహన్ లాల్ ఈ మూవీలో నటిస్తున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.అయితే మూవీ యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఈ మూవీలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ని రిషబ్ శెట్టి కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారట. అలాగే టాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ నటుడిని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారట. గెస్ట్ అప్పీరియన్స్ ఉన్న పాత్రలు అయిన కూడా అన్ని భాషలలో పేరున్న నటులని తీసుకుంటే ఈ మూవీకి బిజినెస్ పరంగా బాగా కలిస్తోస్తుందని రిషబ్ శెట్టి ఇలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం వినిపిస్తోంది.అయితే ఈ మూవీలో కాంతారలో ఉండే యాక్టర్స్ ఎవరూ కూడా ఉండరని సమాచారం తెలుస్తోంది. ప్రీక్వెల్ కథ కావడంతో పీరియాడికల్ జోనర్ లో సినిమా ఉండబోతోంది. అందుకు తగ్గట్లుగానే నటీనటులని ఎంపిక చేసుకుంటున్నారంట. కాంతార సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కాంతార2 మూవీపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. మరి రిషబ్ శెట్టి ఈ సినిమాతో ఎటువంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: