లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన చిన్న సినిమాలలో మ్యాడ్ మూవీ ఒకటి. ఈ మూవీ లో నార్నే నితిన్ , సంగీత్ శోభన్ , నితిన్ రామ్ లు ప్రధాన పాత్రల్లో నటించగా ... కళ్యాణ్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. అవి అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను  వసూలు చేసింది. ఇలా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా ఉగాది రోజే "మ్యాడ్ 2" మూవీ ని ప్రారంభించారు. ఇకపోతే ఈ రోజు తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. అలాగే ఈ సినిమాకు టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

మూవీ ని "మ్యాడ్ స్క్వేర్" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా కొరకు ఉన్నాయి. ఈ సినిమాలో నార్నే నితిన్ , సంగీత్ శోభన్ , రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కనిపించనుండగా ... కళ్యాణ్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mad