బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ విద్యా బాలన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ బిగినింగ్ లో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఎప్పుడు అయితే ఈమె డర్టీ పిక్చర్ మూవీ లో నటించి సూపర్ క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుందో అప్పటి నుండి ఈమె ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ మూవీ లలో ప్రధాన పాత్రల్లో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమె తన కెరీర్ లో ఇప్పటి వరకు అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది.

ఎక్కువ శాతం వాటి ద్వారానే గుర్తింపును కూడా సంపాదించుకుంది  ఇది ఇలా ఉంటే తాజాగా విద్యా బాలన్ ఈ ఇంటర్వ్యూన్లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తన సినీ కెరియర్ లో ఎదుర్కొన్న ఒక వింత అనుభవం గురించి చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విద్యా బాలన్ మాట్లాడుతూ ... నా జాతకం బాగోలేదని దురదృష్టవంతురాలను అని చెప్పి ఓ నిర్మాత నన్ను సినిమా నుంచి తొలగించారు. ఇక మూఢవిశ్వాసాలు ఉన్న ఓ దర్శకుడు తన మూవీ విజయం సాధించాలి అని 40 రోజులు పాటు ఒకే షర్ట్ ను ధరించాడు.

ఇక చివరికి చూస్తే ఆ చిత్రం పరాజయం పాలయ్యింది అని చెప్పింది. ఇక విద్యా బాలన్ ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఆ సినిమా వివరాలు ... ఆ మూవీ పేరును చెప్పాలనుకోవట్లేదు అని తెలియజేసింది.  ఇకపోతే విద్యా బాలన్ ప్రస్తుతం కూడా వరుస సినిమాలలో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఉన్నాయి. ఇలా ఈ బ్యూటీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో తన కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vb