యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకొని ఆ తదుపరి తాను చేయబోయే మూవీ లను కూడా అదే రేంజ్ లో సెట్ చేసి పెట్టుకున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మొదట ఈ మూవీ ఒక భాగం గానే మొదలు అయ్యింది.

కానీ ఆ తర్వాత ఈ సినిమా లోని పాత్రలు పెద్దవి కావడం ... అలాగే ఈ కథ స్పాన్ కూడా చాలా పెద్దది కావడంతో ఈ మూవీ ని ఒక భాగంలో చూపించలేము అని ... ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఈ మూవీ దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు. అందులో భాగంగా ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక చాలా రోజుల క్రితమే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా రోజుల క్రితమే వెలువడింది. ఆ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ నుండే ప్రారంభించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వీలు కాలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అంత లోపు ఎన్టీఆర్ కూడా హిందీ సినిమా "వార్ 2" కి సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే "వార్ 2" మూవీ కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు శరవేగంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: