సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొన్ని రోజుల్లోనే రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనుండగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూ లో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ... రాజమౌళి , మహేష్ కాంబోలో సినిమాకు సంబంధించిన పూర్తి కథ సిద్ధం అయ్యింది అని ... ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాడు అని ... మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే మహేష్ కూడా రాజమౌళి సినిమాకు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ కోసం ఎంతైనా కష్టపడేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. తాజాగా మహేష్ తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి యూరప్ కు వెళ్ళిన విషయం మన అందరికీ తెలిసిందే. అక్కడ కుటుంబంతో పూర్తి సమయం కేటాయించకుండా రాజమౌళి మూవీ కోసం అక్కడి పలువురు నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకముగా స్కెటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారట.

ఇక ఇప్పటికే మహేష్ , రాజమౌళి సినిమా కోసం తన లుక్ ను కూడా మార్చేశాడు. గుబురు గడ్డం పొడవాటి వెంట్రుకలతో ఈ మధ్య కొన్ని ప్రదేశాలలో మహేష్ కనిపించాడు. ఇక ఈ లుక్ లో మహేష్ అదిరిపోయే రేంజ్ స్టైలిష్ లుక్ లో కనిపించడంతో ఈ మూవీ తో రాజమౌళి , మహేష్ ను ఫ్యాన్ వరల్డ్ స్థాయికి తీసుకువెళ్తాడు అని మహేష్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: