పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి ధానయ్య ఈ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు . ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు . ఇక పోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోను విడుదల చేసింది . దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే మరీ ముఖ్యంగా ఆ చిన్న వీడియోకు తమన్ ఇచ్చిన హాంగ్రి చీతా సాంగ్ సూపర్ గా ప్లస్ అయ్యింది.  ఈ సాంగ్ తో ఆ చిన్న వీడియో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా మొత్తం ఆల్బమ్ పై కూడా అంచనాలు పెరిగేలా చేసింది. ఇకపోతే తాజాగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని హాంగ్రి చీతా సాంగ్ కి పవన్ కళ్యాణ్ ఎడిట్ చేసిన ఓ వీడియోను తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియోపై తమన్ స్పందించాడు.

ఆ వీడియోపై తమన్ స్పందిస్తూ ... ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇలా తమన్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ చెప్పడంతో ఈ మూవీ ఆల్బమ్ ఏ స్థాయిలో ఉంటుందో ఆల్బమ్ తోనే ఈ సినిమా రేంజ్ పెరిగిపోతుంది అని పవన్ అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: