సీనియర్ హీరోయిన్ మీనా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా దాదాపు దశాబ్ద కాలం పాటు హవా నడిపించింది. తన అందం అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా జోడి కట్టి పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది. ఇక ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలలో కూడా భాగం అయింది ఈ హీరోయిన్. అయితే సీనియర్ హీరోయిన్ గా మారిన తర్వాత కూడా ఇక కొన్ని సినిమాలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది.


 ఇలా మీనా సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ఇక ఆమె జీవితంలో ఊహించని ఘటన జరిగింది. ఏకంగా ప్రేమగా చూసుకునే భర్త అకాల మరణంతో ఆమె ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. అయితే ఇలా భర్త విద్యాసాగర్ మరణంతో మీనా బాధలు ఉంటుంది అని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు పుట్టించారు  ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతుందని.. ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉంది అంటూ వార్తలు తెర మీదకి వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలపై మీనా ఇటీవలే మాట్లాడారు.


 నా భర్త విద్యాసాగర్ మృతితో విషాదంలో మునిగిపోయిన తాను ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. భర్తను కోల్పోయిన విషాదం నుంచి బయటపడేందుకు సినిమాలతో బిజీగా మారుతున్నా. అయితే కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా భర్త చనిపోయిన బాధలో ఉన్న తనకు రెండో పెళ్లి వార్తలు ఎంతగానో బాధించాయి. తమిళ నటుడు ధనుష్ తో సంబంధం అంటగట్టడం దురదృష్టకటం. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. భర్త చనిపోతాడని అసలు ఊహించలేదు. జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమి ఊహించుకోవడం లేదు. భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన దృష్టి మొత్తం తన కూతురి భవిష్యత్తుపైనే ఉంది అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: