ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ నటులలో సుధీర్ బాబు ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ ఏ మూవీ కూడా ఈ హీరోకి మంచి విజయాన్ని అందించలేక పోతుంది. కొంతకాలం క్రితం సుధీర్ "హంట్" అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

ఈ సినిమాలో శ్రీకాంత్ , భరత్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఆ తర్వాత సుదీర్ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి హర్ష వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన మామ మాచ్చింద్ర అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే సుదీర్ "హరోం హారా" అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

జ్ఞాన సాగర్ ద్వారకమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ మూవీ యూనిట్ మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టి వీలైనంత త్వరగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరస అపజాయలతో డీలా పడిపోయిన సుధీర్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sb