ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి మరి కొంత కాలంలోనే మహేష్ బాబు హీరోగా ఓ మూవీ ని తెరకెక్కించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనుండగా ... ఏం ఏం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందించనుండగా ... సాయి మాధవ్ బుర్రా మాటలని అందించనున్నారు. కాగా ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ కోసం ఇప్పటికే బాడీ పరంగా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టోటల్ కథ పూర్తి అయ్యింది అని ఈ సినిమాకు కథను అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ఈ ఇంటర్వ్యూలో అధికారికంగా ప్రకటించాడు.

ఇక ప్రస్తుతం రాజమౌళిమూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో రాజమౌళి మహేష్ ను కూడా ఎక్కువగా మీట్ అవుతున్నాడు. అలాగే మహేష్ మేక్ ఓవర్ విషయంలో కూడా రాజమౌళి ఎన్నో సూచనలు, జాగ్రత్తలు మహేష్ కో ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రాజమౌళి , మహేష్ కాంబో మూవీ కి సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వార్తలపై రాజమౌళి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దానితో తన టీం మొత్తానికి మహేష్ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా కూడా బయటికి వెళ్ళకూడదు అని... వారందరికీ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఇకపై ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ అయిన అఫిషియల్ గా వస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: