సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపాందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది . ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ... ఈ సినిమాలో నాగార్జున పాత్ర నిడివి పెద్ద ఎక్కువ సమయం ఉండకపోయినప్పటికీ ఉన్న కాస్త సమయం లోనే ఈయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని కథ మొత్తాన్ని మలుపు తిప్పే విధంగా నాగార్జున పాత్ర ఈ సినిమాలో ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే తాజాగా నాగార్జునను కలిసి లోకేష్ కనకరాజు ఈ మూవీ కథను మొత్తం వినిపించినట్లు , ఆ కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమా స్టోరీ , అందులో ఆయన పాత్ర బాగా నచ్చడంతో నాగార్జున వెంటనే రజిని హీరో గా లోకేష్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నాగార్జున ఏదైనా సినిమా కథ నచ్చితే వేరే హీరోతో అయినా నటించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం నాగార్జున , ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: