తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి విశాల్ తాజాగా హరి దర్శకత్వంలో రూపొందిన రత్నం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ నటుడు వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా ఈ నటుడు ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్నడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తనకు నచ్చిన హీరో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా విశాల్ మాట్లాడుతూ ... నాకు తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ అంటే చాలా ఇష్టం అని ... ఆయనతో సినిమా కూడా చేయాలి అని ఉంది. అందుకోసం కరోనా సమయంలో ఒక అదిరిపోయే కథను కూడా అతని కోసం రెడీ చేశాను. అలాగే ఆ కథను ఆయనకు వినిపించాలి అని తన అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నించాను అని విశాల్ పేర్కొన్నారు.

ఇక ఆయనతో సినిమా గురించి ప్లాన్ చేసేది ఏమీ లేదు అని ... భవిష్యత్తులో ఒక వేళ కుదిరితే ఆ కథను వినిపిస్తాను. విజయ్ కి ఆ స్టోరీ కనుక నచ్చినట్లు అయితే సినిమా వర్కౌట్ అవుతుంది అని తాజాగా విశాల్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండే విశాల్ కొంత కాలం క్రితమే మార్క్ అంటోనీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్నాడు. మరి రత్నం మూవీ తో విశాల్ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర విశాల్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: