నాచురల్ స్టార్ నానిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఆయన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానాలు సంపాదించుకున్నారు. హీరో నాని నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.అందులో ఒకటి 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతో మంది హృదయాలను దోచుకుంది. 2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో  హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. స్టార్ హీరో నాని  ఈ మూవీలో క్రికెటర్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 ఈ సినిమా విడుదలై 5 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో జెర్సీ స్పెషల్ షో  వేశారు. దీనికి నాని తన భార్య అంజనాతో కలిసి హాజరయ్యారు. అక్కడ అభిమానుల ఆదరణ చూసి నేచురల్ స్టార్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ' అభిమానుల ఆదరణ చూస్తుంటే ఈరోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. మళ్లీ  తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం  క్రికెటర్ అర్జున్ తిరిగి భూమి మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది' అని ఎమోషనల్ అయ్యారు.

ఆయనతోపాటు ఆయన భార్య  అంజనా కూడా ఎక్స్ వేదికగా  పోస్ట్ పెట్టారు. 'తొలిసారి థియేటర్లో ఆ సినిమా చూసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్ నన్ను భావోద్వేగానికి   గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్ ఇప్పుడిప్పుడే 'జెర్సీ' థీమ్ సాంగ్  పియానో పై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు' అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  ఇటీవల 'దసరా'  సినిమాతో మన ముందుకొచ్చిన హీరో నాని,  ప్రస్తుతం 'సరిపోదా శనివారం' సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: