ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి 2898AD.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం దాదాపుగా చాలామంది సెలబ్రిటీలు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది.


ఈ రోజున అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేయడం జరిగింది చిత్ర బృందం. కల్కి సినిమా నుంచి అప్డేట్ ఇచ్చి చాలా కాలం అవ్వడంతో.. కాస్త హ్యాపీనెస్ ఇవ్వడానికి  స్టార్ స్పోర్ట్స్ లో అమితాబచ్చన్ క్యారెక్టర్ని రివిల్ చేశారు.. కల్కి సినిమాలో అమితాబచ్చన్ అశ్వత్థామ గా కనిపించబోతున్నారు. ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఈ గ్లింప్స్ ద్వారా తెలియజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభాస్ కు జోడిగా దిశాపటాని, దీపికా పదుకొనే నటిస్తున్నారు.అలాగే కమలహాసన్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.
ఇప్పుడు తాజాగా అమితాబచ్చన్ క్యారెక్టర్ ని రివిల్ చేయడంతో ఈ సినిమా పైన మరింత బజ్ పెరిగిపోతోంది. దాదాపుగా ఈ సినిమా 6000 సంవత్సరాల క్రితం కథతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం పురాణాల ప్రకారమే తెరకెక్కించేలా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఏడుగురు చిరంజీవిలు ఉంటారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గ కారణం ఇటీవల అమితాబచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ గా చూపించడంలో ఈ వార్త నిజమా అనే విధంగా మారిపోయింది. మరి కల్కి సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో చిత్ర బృందం ఈ విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. అయితే ఈ వీడియో మాత్రం తెలుగులో విడుదల చేయలేదు. దీంతో కాస్త అభిమానులు సైతం నిరాశలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: