మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈయన మట్కా అనే పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇటీవల ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వరుణ్ ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి వరుణ్ ఇటీవల కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ మిస్టర్ ఫర్ఫెక్ట్ ,అంతరిక్షం సినిమాలలో నటించారు.

సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట రహస్యంగా ప్రేమ ప్రయాణం చేస్తూ ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా రహస్యంగా ప్రేమ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇలా పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ లావణ్య ఇద్దరు కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.లావణ్య సైతం వెబ్ సిరీస్ లలోను అలాగే సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ జంట వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడపడమే కాకుండా వీరికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటే లావణ్య త్రిపాఠి తాజాగా తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు.  తన భర్త భుజంపై మెడ వాల్చుతూ ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ కు రెడ్ కలర్ లవ్ సింబల్స్ షేర్ చేస్తూ ఇన్ఫినిటీ సింబల్ పెట్టారు దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. తన భర్తతో తనకు ఉన్నటువంటి ప్రేమ అనంతమని అర్థం వచ్చేలా ఈమె పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఎప్పుడు మీరు ఇద్దరు ఇలాగే ప్రేమగా ఉండాలి అంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: