టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు కాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ లో మొదట నక్క, తోడేలు ఆ తర్వాత పులి వెంటాడాలని ఎక్కడినుంచి ఎక్కడికి పరుగెత్తాలో జూనియర్ ఎన్టీఆర్ కు ముందే మార్క్ చేసి చెప్పామని సెంథిల్ కుమార్ అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ పరుగెడుతున్న దిశలో కెమెరా ఫాలో అవుతుందని మేము యాక్షన్ అని చెప్పిన వెంటనే వాయు వేగంతో జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిపోయేవాడని తారక్ వేగాన్ని అందుకుంటూ ఎలా షూట్ చేయాలో మాకు అర్థం అయ్యేది కాదని సెంథిల్ కుమార్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అంత వేగంగా పరుగెత్తగలడని నేను భావించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే విషయం తారక్ దగ్గర ప్రస్తావిస్తే తాను బ్యాడ్మింటన్ ప్లేయర్ నని తన స్టామినా వెనుక సీక్రెట్ అదేనని చెప్పాడని సెంథిల్ కామెంట్లు చేశారు.

 ఎన్టీఆర్ వేగానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సీన్ ను బల్గేరియా అడవుల్లో 12 రోజుల పాటు షూట్ చేశారని సమాచారం అందుతోంది. తారక్ అంత వేగంగా పరుగెత్తగలడు కాబట్టే ఫ్యాన్స్ అతనిని టైగర్ అని పిలుస్తారనే అర్థం వచ్చేలా సెంథిల్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన యాక్టింగ్ టాలెంట్ తో ఇండస్ట్రీ తన గురించి మాట్లాడేలా చేస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ గురించి టాలెంటెడ్ సినీ ప్రముఖులు కామెంట్లు చేస్తుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. దేవర  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న తారక్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుని ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ 400 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: