నందమూరి నట సింహం బాలకృష్ణ  ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల లో కూడా బిజీ గా ఉన్నారు. అలాగే వ్యాఖ్యాత గా కూడా బాలయ్య ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా కెరియర్ పరం గా ఎంతో బిజీ గా ఉన్నటువంటి బాలయ్య భారీ స్థాయి లోనే ఆస్తులను కూడా సంపాదించారనే సంగతి తెలిసిందే. కానీ తాజా గా బాలకృష్ణ కు భారీ స్థాయి లో అప్పులు ఉన్నాయి అంటూ ఆయన వెల్లడించారు. మరి బాలయ్య బాబు సంపాదించిన ఆస్తులు ఎంత ఆయనకు ఎన్ని అప్పులు ఉన్నాయి తన కొడుకు మోక్షజ్ఞ  కు ఎంత ఆస్తి వారసత్వం గా వస్తుంది అనే విషయానికి వస్తే.బాలకృష్ణ ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్య ర్థిగా పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్స్ జరుగుతున్న నేపథ్యం లో బాలయ్య అభిమానుల తో పెద్ద ఎత్తున ర్యాలీ గా వెళుతూ నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ లో తెలిపిన విధంగా.. బాలయ్య ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.  బాలకృష్ణ పేరిట 81 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండగా.. 9 కోట్ల.. 9 లక్షల అప్పులు ఉన్నట్టు వివరాలు సమర్పించారు బాలయ్య.ఇక ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ 140 కోట్ల 38 లక్షల 83 వేలు కావడం గమనార్హం. ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేలు ఉన్నట్టు వివరాలు సమర్పించారు. ఆస్తులు.. అప్పులతో కూడిన పూర్తి వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటు వంటి అభిమానులు బాలయ్య పేరిట ఉన్న ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: