ఒక స్టార్ హీరో రేంజ్ ఏంటో, ఒక స్మాల్ హీరో కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో డిసైడ్ చేసేది ఈ కలెక్షన్లే. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలే కాదు.స్మాల్ హీరోల సినిమాలు కూడా కళ్లుచెదిరే ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. కొత్త సినిమా రిలీజవుతుందంటే చాలు.. రిలీజ్ ముంగిట ఆ ఫలానా సినిమాకు హైప్ ఏ రేంజ్ లో వస్తుందో, అదే ఓపెనింగ్స్ నెంబర్స్ ను డిసైడ్ చేస్తుంది. అయితే ఈ స్ట్రాటజీ కొత్త సినిమాలకు మాత్రమే వర్కవుట్ అవుతంది. అదే ఆల్రెడీ అరిగిపోయిన సినిమాలు రీ-రిలీజ్ అయితే...

రీ-రిలీజ్ కలెక్షన్ల గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏముంది.. 1,2 కోట్లు వస్తేనే మహా ఎక్కువ అని అనుకుంటున్నారా..? అది పెద్ద పొరపాటే. ఎందుకంటే రీ రిలీజ్ తోనే రికార్డులు సృష్టించాడు దళపతి విజయ్. నిన్న రీ రిలీజైన గిల్లీ సినిమాకు ఆడియెన్స్ వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు రిలీజైన కూడా అంత సందడి జరగలేదు. ఒక్కో థియేటర్ లో గిల్లీ షో రెస్పాన్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయని తమిళ తంబీలు చెబుతున్నారు. నిజంగానే ఇది రీ-రిలీజా లేదంటే కొత్త సినిమానే రిలీజయిందా అన్న రేంజ్ లో కటౌట్ లు, క్రాకర్స్ తో థియేటర్ లు దద్దరిల్లిపోయాయి.

ఇక ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన కలెక్షన్లు చూస్తే.. నిజంగానే దిమ్మతిరిగిపోతుంది. నిన్న రీ రిలీజైన గిల్లీ సినిమాకు అక్షరాల రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఒక రీ రిలీజ్ సినిమాలు ఇన్ని కోట్లంటే మాములు విషయం కాదు. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు సైతం ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ తీసుకురాలేకపోతున్నాయి. సంక్రాంతి కి రిలీజైన అయాలాన్, సూపర్ స్టార్ నటించిన లాల్ సలాం సినిమా కూడా తొలి రోజు ఇన్నేసి కలెక్షన్లు కొట్టలేకపోయాయి.

అలాంటిది ఒక రీ-రిలీజ్ సినిమా కొట్టిందంటే ఊచకోత అనే చెప్పాలి. నిజానికి ఇది తెలుగులో అరివీర భయంకర హిట్టయిన ఒక్కడు సినిమాకు రీమేక్. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంలో ధరణి డైరెక్ట్ చేశాడు. ఇక్కడ మహేష్, భూమిక నటించగా.. తమిళంలో విజయ్, త్రిషలు నటించారు. టాలీవుడ్ లో ఒక్కడు ఏ రేంజ్ లో హిట్టయిందో, కోలీవుడ్ లో గిల్లీ అదే రేంజ్ లో హిట్టయింది. 2004 లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.9 కోట్లతో తెరకెక్కిన గిల్లీ మూవీ పైనల్ రన్ లో రూ.50 కోట్ల వరకు గ్రాస్ కొల్లగొట్టి విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: