బాలీవుడ్‌లో యువ తారలు ఉర్పీ జావెద్, నిమ్రిత్ అహ్లువాలియా, స్వరూప ఘోష్, స్వస్తిక ముఖర్జీ నటించిన చిత్రం లవ్, సెక్స్ ఔర్ ధోఖా 2 (LSD 2) చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రంలో తుషార్ కపూర్, అనుమాలిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏక్తాకపూర్, శోభాకపూర్, దివాకర్ బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకు దివాకర్ బెనర్జీ దర్శకత్వం, రచన సహకారం అందించారు. ఏప్రిల్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..లవ్, సెక్స్ ఔర్ ధోఖా 2  మూవీ యువ తారలు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో నిర్మించారు. ఈ సినిమాకు ఆర్టిస్టులు, టెక్నిషియన్స్, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొని సుమారుగా 20 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఇక ఈ మూవీని ఇండియాలో సుమారుగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఉర్పీ జావెద్ లాంటి యువ అందాల తారలు ఉన్నప్పటికీ.. యూత్‌ను థియేటర్‌కు రప్పించలేకపోయారు. మొదటి రోజు నుంచి వారాంతం ఆదివారం వరకు కూడా ఆక్యుపెన్సీ దారుణంగా నమోదైంది. ఈ సినిమా ఇండియాలోనే ప్రధాన నగరాలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో కేవలం 10 శాతానికి మించి ఆక్యుపెన్సీ నమోదు చేయలేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఇక LSD 2 మూవీ పేలవంగా కలెక్షన్లను నమోదు చేశాయి. తొలి రోజు 15 లక్షల నికర వసూళ్లు, రెండో రోజు 12 లక్షలు, 3వ రోజు 8 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టాయి. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం 35 లక్షల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మనగడ సాధించడం కష్టమే అనే ఫీలింగ్ కలిగించింది.

ఇక లవ్, సెక్స్ ఔర్ ధోఖా 2 (LSD 2) మూవీ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రం కనీసంగా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధిస్తే తప్ప లాభాల్లోకి ప్రవేశిస్తుంది. కానీ ఈ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించడం కష్టసాధ్యంగా మారింది. ఏ కోశాన కూడా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు లేవు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.బాలాజీ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందించిన చిత్రాల్లో లవ్, సెక్స్ ఔర్ ధోఖా 2 (LSD 2) చిత్రం దారుణమైన సినిమాగా మారే అవకాశం ఉంది. ఈ సినిమాకు దాదాపుగా ఆడియెన్స్ ముఖం చాటేశారనే విషయం తాజా బాక్సాఫీస్ కలెక్షన్లతో తెలియజేస్తున్నది. ఈ సినిమా ఏ మేరకు నష్టాల్లో క్లోజ్ అవుతుందనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: