ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీతో తారక్ నటనపై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు.దీంతో తారక్ నటిస్తోన్న దేవర పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో ఇది. పాన్ ఇండియా స్థాయిలో రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తేంటే చాలా కాలం తర్వాత ఈ మూవీతో మరోసారి తారక్ మాస్ నటవిశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైన హిట్టు కొట్టాలనే కసిపై ఈ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు కొరటాల శివ.

దేవర చిత్రంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ కలిసి తారక్ స్టెప్పులు వేయనున్నారని టాక్. ఈ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించి చివరకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయడం ఇది మొదటి సారి కాదు… ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాటతో పూజా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు దేవరలోనూ స్పెషల్ సాంగ్ ఓ రేంజ్ లో ఉండనుందని అంటున్నారు. ఇన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న పూజా.. ఇప్పుడు దేవర స్పెషల్ పాటతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడట. అలాగే ఇప్పటికే స్పెషల్ సాంగ్ కూడా కంపోజ్ చేశాడట.

ఈ మూవీలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ ను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అనుహ్యంగా ఈ మూవీని వాయిదా వేశారు. అందుకు కారణం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగడం.. మరోవైపు ఐపీఎల్ జరుగుతుండడంతో ఈ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: