తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సంవత్సరాల క్రితం ఒకడు అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భూమిక హీరోయిన్ గా నటించగా ... గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ ని తమిళ్ లో గిల్లి అనే పేరుతో విజయ్ అధికారికంగా రీమేక్ చేశాడు. ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో సినిమాల రీ రిలీజ్ చేసే ట్రెండు జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం క్రితం మహేష్ హీరోగా రూపొందిన బిజినెస్ మాన్ మూవీ ని రీ రిలీజ్ చేయగా ఈ మూవీ రీ రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇక తాజాగా ఒక్కడు మూవీ కి అధికారికంగా రీమేక్ అయినటువంటి గిల్లి సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 7.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి ఇంత వరకు మహేష్ పేరు మీద ఉన్న రికార్డును ఈ మూవీ చెరిపేసింది. ఇలా రీ రిలీజ్ లో భాగంగా వరల్డ్ వైడ్ మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలలో విజయ్ హీరోగా రూపొందిన గిల్లి మూవీ మొదటి స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: