తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ కొంత కాలం క్రితం ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఎస్ జె సూర్య మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ తో విశాల్ కు కూడా మంచి గుర్తింపు లభించింది.

మార్క్ ఆంటోనీ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత విశాల్ , హరి దర్శకత్వంలో రత్నం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఇది వరకే విశాల్ , హరి కాంబో లో రూపొందిన పూజ మూవీ మంచి విజయం సాధించడంతో రత్నం మూవీ పై తమిళ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే రత్నం మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 26 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో తాజాగా విశాల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా విశాల్ "రత్నం" సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా విశాల్ మాట్లాడుతూ ...  రత్నం మూవీ అదిరిపోయే రేంజ్ లో వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది అని విశాల్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: