తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో కస్తూరి ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం ఎన్నో సినిమాలలో హీరోయిన్ పాత్రలలో , ముఖ్యపాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఆ సమయంలో ఈ బ్యూటీ తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చాలా సంవత్సరాల పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగించిన ఈమె ఆ తర్వాత కాలంలో క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త వెనుకబడింది. ఇక ఆ తర్వాత ఈమె సీరియల్ లో నటించడం మొదలు పెట్టింది.

ఈమె సీరియల్స్ ద్వారా కూడా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత మరికొన్ని సీరియల్ లో కూడా అవకాశాలను దక్కించుకుంది. ఇలా వరుస సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సమయంలోనే ఈమెకు మళ్ళీ సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో అనేక సినిమాల్లో తల్లి , అక్క , వదిన లాంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా నాకు ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ వారు ఆ సినిమాలో పాత్ర కోసం నన్ను అనుకున్న తర్వాత వారు అనుకున్న పాత్రలో నేను సెట్ కాను అని నన్ను తీసేశారు. ఎందుకు అంటే ఆ పాత్రలు చేయాలి అంటే నాటికి ఎక్కువ వయస్సు ఉండాలి. నేను అంత వయస్సు ఉన్న దానిలా కనిపించకపోవడంతో వారు నన్ను ఆ సినిమా నుండి తీసేశారు అని ఈమె చెప్పుకొచ్చింది.

అలాగే నేను అందంగా కనిపించడం కోసం జుట్టుకు రంగు కూడా వేసుకోను. అయిన నేను అందంగానే కనబడతాను అంత అందం ఉండడం వల్లే కొన్ని సినిమాలు నా నుండి దూరం అయ్యాయి అని అలాగే మహేశ్ బాబు వయసు , తన వయసు దాదాపుగా సమానం అని  ఈమే చెప్పు పోయింది. ఇక మహేష్ బాబు కంటే ఈమె ఒకే సంవత్సరం పెద్దది కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: